Monday, May 6, 2024
- Advertisement -

అందరిని థ్రిల్ చేసిన మహేష్!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా పై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ సమంత ప్రణీత లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటి లో జరుగుతోంది. ఇక్కడ ఈ చిత్రానికి సంబందించిన ఎండింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ ఎండింగ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో మహేష్ బాబు నాన్ స్టాప్ గా నాలుగు నిమిషాల సేపు కట్స్ లేకుండా నటించి చిత్ర యూనిట్ ను ఆశ్చర్య పరిచాడట.

ఈ ఎండింగ్ ఎమోషనల్ సన్నివేశంలో చిత్రంలో నటిస్తున్న కాస్ట్ మొత్తం పాల్గొందట. వచ్చే నెల ఏప్రిల్ 8న ఉగాది సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు కొత్త టిజర్ ని  విడుదల చేయనున్నారట. ఈ సినిమా తర్వాత మహేష్ మురగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, హింది భాషల్లో కూడా తెరకెక్కించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -