పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మనస్సు ఎంత మంచిదో చెప్పకనే చెప్పాడు. మరోసారి తన ఔదార్యాన్నీ చాటుకున్నాడు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాల విషయంలో పవన్ ముందు ఉంటాడు. ఇప్పుడు తన సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ గా పని చేస్తున్న రవి నఎ వ్యక్తికి 25లక్షల రూపాయల సహాయం చేసినట్లు తెలుస్తుంది.
అపదలో ఉన్న వారిని అదుకోవడంలో పవన్ ఎప్పుడు ముందు ఉంటాడు. క్యాన్స్‌ర్ తో పోరాటం చేసిన శ్రీజా ను హాస్పిటల్ లో కలిసి పరామర్శించడం దగ్గర నుంచి.. హూదూద్, చెన్నై వరదలు తదితర విషయాల వరకు పవన్ ముందు ఉండి సహాయం చేశాడు. ఇక ఇప్పుడు మరోసారి తన సినిమాకి పని చేస్తున్న రవి భార్యకు హార్ట్ ఆపరేషన్ కోసం పవన్ 25లక్షలు సహాయం చేసి దట్ ఈజ్ పవన్ అనిపించుకున్నాడు.
పవన్ అభిమానులు ఈ వార్త తెలుసుకోని పవన్ అపదలో ఎవరు ఉన్న అదుకోవడంలో ఎప్పుడు ముందు ఉంటారు అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా బాబీ దర్శకత్వం వహించాడు.
{youtube}ZygcbwyZbLM{/youtube}
