Monday, May 13, 2024
- Advertisement -

హరితేజకు బ్రేక్ ఇచ్చి.. మలుపు తిప్పినవారు ఎవరు..?

- Advertisement -

హరితేజ.. ఈమే.. కొన్ని వారాల క్రితం పెద్దగా ఎవరికి తెలియదు. అ ఆ మూవీ చూసినవారు ఈమెను గుర్తు పడతారు. అయితే నటిగా అ ఆ మూవీలో హరితేజ త్రివిక్రమ్‌ బ్రేక్‌ ఇస్తే, ఆమెని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ చేసింది మాత్రం ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తోన్న ‘బిగ్‌ బాస్‌’ షోనే. మొదట బిగ్ బాస్ లోకి వచ్చినవారు.. జనానికి పెద్దగా నచ్చలేదు.

సంపూర్ణేష్‌, ధన్‌రాజ్‌, ముమైత్‌ఖాన్‌, అర్చనలాంటి వాళ్లు బిగ్ బాస్ లో హైలైట్ అవుతారని.. అనుకున్నారు. అయితే సంపూర్నేష్ బాబు.. స్టార్టింగ్ లోనే ఉండలేనని.. వెళ్లిపోయాడు. ఇక ధన్‍రాజ్ ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. ఆరు వారాలుగా జరుగుతోన్న ఈ షోలో.. మిగిలి వున్న కంటెస్టెంట్స్‌ అంతా జనాలపై ఎంతో కొంత ముద్ర వేయగలిగారు. నవదీప్ లాంటివాళ్లు.. షోకి ఎనర్జీ తీసుకొనిరాగా.. హరితేజ ఒంటిచేత్తో నడిపిస్తోంది. స్టార్టింగ్ లో అందరి వెనక ఉండిపోయిన హరితేజ.. షో మిడిల్ స్టేజ్ కి వచ్చేసరికి.. బాగా ఓపెన్‌ అయింది హరితేజ.

ఎప్పుడూ తన అల్లరి, ఆట పాటలతో బిగ్‌బాస్‌కి ఈమే విన్నర్‌ అవుతుందనే భావన కలిగించింది. కొన్ని టాస్క్ ల విషయంలో.. ఆమె అదరగొడుతోంది. ప్రధానంగా ఈ సీజన్ కి హరితేజ చెప్పిన హరికథ వన్ ఆఫ్ ది హైలైట్స్ గా నిలిచింది. ఇకపై ఆమె డామినేషన్‌ తగ్గించడానికి మిగతా వాళ్లు ఎలాంటి ట్రిక్కులతో వస్తారనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -