Tuesday, May 14, 2024
- Advertisement -

కాకినాడ ఎన్నిక‌ల్లో టిడిపిపై ఏమాత్రం ప్ర‌భావం చూప‌ని ముద్ర‌గ‌డ పిలుపు

- Advertisement -

గ‌త కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడ‌కి కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. త‌మ జాతికి రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని ఆందోళ‌న‌లు చేస్తూ ప్ర‌భుత్వానికి ముచ్చెమ‌టలు ప‌ట్టిస్తున్నారు. తునిలో రైలు దగ్ధం ఘటన తర్వాత ఆందోళనలు తీవ్రస్ధాయికి చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని అంతే స్ధాయిలో అణిచివేస్తోంది.

దీంతో గ‌త కొంత కాలంగా కాకినాడ కార్పొరేష‌ణ్ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తూ వ‌చ్చింది ప్ర‌భుత్వం. విధిలేని ప‌రిస్థితుల్లో ఎన్నికకు సిద్దపడింది. దాంతో టిడిపిలో తీవ్ర ఆందోళన మదలైంది. అప్పటికే నంద్యాల ఎన్నికలో టిడిపి-వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అదేసమయంలో కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ముద్రగడ పిలుపినిచ్చారు. దాంతో టిడిపి పరిస్ధితి మరింత దయనీయంగా తయారైంది.

ముద్రగడ పిలుపుతో టిడిపి ఇబ్బంది ప‌డ్డ పార్టీ కారణాలు చెప్పి కాకినాడ ఎన్నికను వాయిదా వేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాధ్యం కాకపోవటంతో తప్పని పరిస్ధితిలోనే ఎన్నికకు సిద్దపడింది. ఫలితాలను చూస్తే ఇక్కడ కూడా కాపులు ముద్రగడ పిలుపును లెక్కచేయలేదనే అర్దమవుతోంది. ఎందుకంటే, ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టిడిపి 32 చోట్ల గెలిచింది. ఇక్కడ కాపుల ఓట్లు 45 వేలున్నాయ్. కాపులందరూ నిజంగానే ముద్రగడ పిలుపుకు స్పందించి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసుంటే కచ్చితంగా వైసీపీనే గెలిచుండేదనటంలో సందేహం అక్కర్లేదు. ఇప్ప‌టికె ముద్ర‌గ‌డ ఉద్య‌మాన్ని అణిచివేసిన బాబు …ఇప్పుడు లెక్క‌చేస్తాడా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -