Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ హీరో సినిమా పోయిందని చరణ్ కు బాధ…!

- Advertisement -

హీరో రాంచరణ్ ఇప్పుడు అసహనంతో ఉన్నాడు. దానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి తన సినిమా పోవడం, రెండోది సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడం. మరి చరణ్ ‘బ్రూస్ లీ’ ఫెయిల్యూర్ పట్ల బాధపడితే అందులో ఒక అర్థం ఉంది.

మరి సల్మాన్ సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో” ఫెయిల్యూర్ పట్ల బాధ ఎందుకు? అనేది మాత్రం ఒక మెలికతో కూడిన వ్యవహారం. ఆ హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు చరణ్ డబ్బింగ్ చెప్పాడు. తీరా ఆ సినిమా తెలుగులో కూడా ప్లాఫైంది. మరి ఇప్పుడు బాధ సహజంగానే ఉంటుంది కదా! తను డబ్బింగ్ చెప్పిన సినిమా పోయిందని.

ఈ మధ్య కాదు కానీ.. వెనుకటికి సల్మాన్ సినిమాలు తెలుగులో బాగా ఆడాయి. ప్రత్యకించి సూరజ్ భరత్యాజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాగా ఆడాయి. ప్రేమపావురాలు, ప్రేమాలయం వంటి సినిమాల పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అదే కోవలో అదే డైరెక్టర్, అదే హీరో కాంబినేషన్ లో వచ్చిన ఈ “ప్రేమలీల” కూడా బాగా ఆడుతుందని అందరూ అనుకున్నారు. అయితే అలా జరగలేదు, హిందీలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా తెలుగు కూడా ఎవరినీ ఆకర్షించలేకపోయింది.

 

సల్మాన్ తో ఉన్న స్నేహం కొద్దీ చెర్రీ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో చరణ్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఆడలేదనే పేరు వచ్చింది. దీంతో వేరే హీరో సినిమా ఫెయిల్యూర్ అయినా చరణ్ కు అసంతృప్తి కలుగుతోంది! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -