Sunday, May 5, 2024
- Advertisement -

మెగాస్టార్ ఫ్యాన్స్ కి శుభవార్త..

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంపై రోజుకో వార్త వస్తున్న విషయం తెలిసిందే. ఐతే తాజా ఓ వార్త బయిటకు వచ్చింది. చిరు 150 వ సినిమాకి సంబంధించి ఏప్రిల్ మూడవ వారం నుంచి రెగ్యులర్ షుటింగ్ మొదలకానుందని తెలుస్తోంది. కత్తి రీమేక్ నే ఫైనల్ చేసిన యూనిట్ తెలుగు నెటివిటికి తగట్లు మార్పులు చేస్తున్నారట.

ఈ సినిమాకి వివి వినాయిక్ దర్శకత్వం వహిస్ంచబోతున్నాడు. ఐతే ప్రస్తుతం చిరు తన కుమార్తె శ్రీజ వివాహం పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 28న శ్రీజ వివాహం జరగుతోంది. ఆ తర్వాత చిరు తన  150 వ చిత్రంపై కాన్సర్టేట్ చేయనున్నారు. ఈ సినిమాలో చిరు అదిరిపోయే లుక్‍లో కనిపించి అభిమానులు ఆశ్చర్యపోతారని టాక్.

ఇందుకోసం చిరు ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారు. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు. నయనతార కథానాయకిగా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -