- Advertisement -

సర్దార్ కూడా అంత్యాక్షరి ఆడుతాడా..?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అభిమానుల అంచనలకు తగ్గట్లు ఈ సినిమా తెరకెక్కుతుందట. ఐతే పవన్ నటించిన గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ హైలెట్  గా నిలిచింది.

మరి అలాంటి ఎపిసోడ్ ని ఈ సారి పవన్ కళ్యాణ్ తన తాజా సినిమాలో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు అనేది అందరికీ ఆసక్తికరమైన విషయమే. ఐతే ఈ సారి పవన్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ కి పవన్ స్టెప్స్ వేయబోతున్నాడట. అంతే కాకుండా చిరంజీవి పాపులర్ పంచ్ డైలాగ్స్ ఈ సినిమాలో పలకనున్నారు.

దాదాపు పదిహేను నిముషాలు పైగా సాగే ఈ ఎపిసోడ్ సెకండాఫ్ లో వస్తుందని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లో ‘అంత్యాక్షరి’ ఎంత హైలెట్  అయిందో ‘సర్దార్’ లో ఈ ఎపిసోడ్ అంతే హైలెట్ కానుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే నేలలో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -