Sunday, June 16, 2024
- Advertisement -

మెగా అభిమానులకు పండగే.. పండగ!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్దార గబ్బర్ సింగ్. పవన్ సరసన తొలి సారిగా కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించడు. ఇటివలే ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్‍ లో హల్ చల్ చేస్తుంది. టీజర్‍తో అభిమానులో మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఐతే ఈ సినిమా ఆడియోని ఈ నెల 20న జరపనున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్ది అసలు చిరు ఆడియో వేడుకకు వస్తున్నాడా? లేదా? అనే సందేహంగానే ఉండేది. కానీ రీసెంట్‌గా ఆ సందేహాన్నికి  క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. సర్దార్ ఆడియోకి చిరు గెస్ట్‌గా రావడం ఖాయమని తెలిసింది.

చిరుతో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా సర్దార్ ఆడియోకు వస్తారని తెలుస్తుంది. ఒకే వేడుకపై ముగ్గురు బ్రదర్స్‌ను ఒకేసారి చూడొచ్చుని అభిమానులు అనందపడుతున్నారు. ఇలాగే గబ్బర్ సింగ్ సినిమాకి మెగాబ్రదర్స్ వచ్చారు. ఆ సినిమా బంఫర్ హిట్ అయింది. ఈ సారి కూడా సర్దార్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు అభిమానులు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఆడియో మార్చి 20న హైదరాదాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -