మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నిహారిక, వెంకట చైతన్య వివాహం ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్‌లో ఈ రోజు (డిసెంబర్ 9) రాత్రి 7.15 గంటలకు జరగనుంది. మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం మంగళవారం సాయంత్రం పెళ్లి వేదికకు చేరుకున్నారు.

ఇక పెళ్లి కానుకగా నిహారికకు మెగాస్టార్ చిరంజీవి ఓ ‘మెగా’ గిఫ్ట్ అందించారు. తను ఎంతగానో ఇష్టపడే నిహారికకు రెండు కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక ఆభరణాన్నిఅందించారట. పెళ్లికి ఒక ముందే చిరంజీవి దంపతులు నిహారికకు ఆ ఖరీదైన బహుమతిని అందించారట. తన డాడీ(చిరంజీవిని నిహారికి డాడీ అని పిలుస్తుంది)గిఫ్ట్ చూసి నిహారిక ఫుల్ ఖుష్ అయిందట.
మరోవైపు చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫోటోను, ఇప్పుడు పెళ్లి వేడుకల్లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘మా చేతుల్లో పెరిగిన మా చిన్నారి నిహారికను చైతన్య చేతుల్లో పెడుతున్నాం. కాబోయే దంపతులకు ఈ శకతరుణంలో నా శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ఆయన ప్రేమకు హద్దులు ఉండవు. ఆయన నవ్వులు ప్రతి సందర్భాన్ని వేడుకలా మార్చేస్తాయి’ అంటూ చిరంజీవి షేర్ చేసిన ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు నాగబాబు.
Also Read
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్
కారు పార్టీతో కాంగ్రెస్ కలిసి నడుస్తుందా?