Friday, May 3, 2024
- Advertisement -

బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అలాంటి నేతలే ప్రధాన టార్గెట్

- Advertisement -

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది. ముఖ్యంగా ఇతర పార్టీలోని బడా నేతలను పార్టీలోకి తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తోంది. అలా చేస్తే మిగతా పార్టీలను దెబ్బకొట్టడంతో పాటు బీజేపీవైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది.

దీంట్లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతిని , టీఆర్‌ఎస్‌ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌గౌడ్‌లను పార్టీలో చేర్చుకుంది. రానున్న కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ నుంచి మరో 20 మంది బడా నేతలను కాషాయపు తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నుంచి కూడా అసంతృప్తుల వలసలు ఉంటాయని, అలా వచ్చే అవకాశమున్న వారితో జాబితాను కూడా బీజేపీ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇరు పార్టీల్లోని కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో బీజేపీ ముఖ్యనేత ఒకరు ఇప్పటికే చర్చలు జరిపారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌ ఇటీవల స్వయంగా భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనే ప్రచారం జరిగింది. మరోవైపు నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుటుంబంతో బీజేపీ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

జిల్లాల వారిగా అసంతృప్తుల లిస్ట్‌.. బడా నేతలతో పాటు స్థానికంగా పేరున్న నాయకులను కూడా కాషాయ దళంలోకి చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహాన్ని రచించిదట. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస పరిస్థితి అయోమయంగా ఉండటంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ వైపే చాలా మంది చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ అసంతృప్తి నేతల పేర్లతో ఓ లిస్టును తయారు చేసుకుని పార్టీ అధిష్టానానికి బిజెపి నేతలు ఇచ్చారట. వారితో అధిష్టానం కూడ చర్చలు జరుపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 2023 అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకు దూసుకెళ్తోంది.

Also Read: కారు పార్టీతో కాంగ్రెస్‌ కలిసి నడుస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -