- Advertisement -

తమ్ముడిని సంతోషపెట్టిన అన్నయ్య!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సెట్‍లో చిరంజీవి సందడి చేసిన విషయం తెలిసిందే. సెట్‍లో పవన్‍ను కలిసి సరదగా మాట్లాడి, సర్దార్ టీంతో హ్యాపిగా గడిపారు. ఐతే చిరు పవన్‍ కళ్యాణ్‍ను కలవడం వెనుక అనేక వార్తలు వచ్చిన మెగా అభిమానులు మాత్రం చిరు క్యాజువల్ కలిసారు అని అంటున్నారు.

అసలు చిరు పవన్‍ కళ్యాణ్‍ను ఎందుకు కలసిసాడు అనే విషయం పక్కన పెడితే నలభై నిముషాలు పాటు పవన్‍తో మాట్లాడారట. సర్దార్ లైన్‍ చాలా బాగుంది ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని అలాగే పవన్ రెస్ట్‌ లేకుండా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నందుకు అతని కృషిని చిరు మెచ్చకున్నారని తెలుస్తోంది. అలాగే మెగా ఫ్యాన్స్‌కి ఓ సంతోష పెట్టే న్యూస్ ఇచ్చాడట చిరు. అదేంటంటే.. సర్దార్ సినిమా ఆడియోని మార్చిలో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.

ఐతే ఈ సినిమా ఆడియో వెడుకకు చిరు ఛీఫ్ గెస్ట్ గా వస్తా అని చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. చిరు అలా చేప్పేసరికి  పవన్ కూడా చాలా ఆనందపడ్డాడట. అన్నయ్య చీఫ్ గెస్ట్ గా వస్తానంటే అంతకు మించి ఆనందం ఏముంటుందని అని ఎమోషన్ అయ్యినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ హైదరాబాద్‍లో జరుగుతుంది. పవన్‍ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -