మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం ఇటీవల బెంగుళూరులో జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్ తో శ్రీజ వివాహం జరిగింది. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలో చిరంజీవి అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, మూడు ముళ్లు, తలంబ్రాలు, జీలకర్రబెల్లం ఘట్టం లాంటివి ఆకట్టుకుంటున్నాయి. శ్రీజ పెళ్లి వేడుక సందర్భంగా డెకరేషన్స్ అద్భుతంగా చేసారు. వెడ్డింగ్ డెకరేషన్స్కు పేరుగాంచిన ‘దినాజ్’ ఆధ్వర్యంలో డెకేషన్ అదిరిపోయింది.
ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, కొందరు ప్రముఖులు దాదాపు 250 మంది ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇక శ్రీజను ప్రముఖ స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్ అద్భుతంగా తయారు చేసారు. ఒక మెగా ఫ్యామిలీ మొత్తం ఎంథటిక్ వేర్ లో దర్శనిమిచ్చారు. వివాహం అనంతరం నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మార్చి 31వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరుగబోతోంది. ఈ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
{youtube}v=ItnIVuCseNY{/youtube}
{youtube}v=EicWRiKMxWA{/youtube}
