Sunday, May 19, 2024
- Advertisement -

చిరు పై బాహుబలి భారం

- Advertisement -

చిరు 150వ సినిమా ఇటివలే లాంచ్ అయ్యింది. త్వరలో షూటింగ్ కూడా మొదలు కానుంది. వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ మధ్య కత్తిలాంటోడు పోస్టర్ ఒకటి వచ్చింది. అది అఫీషియల్ పోస్టరా లేక ఫ్యాన్స్ మెడ్ పోస్టరా అనేది క్లారిటీ లేదు.

9 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. చిరు తన 150వ సినిమాలో కొత్తగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చిరు సినిమా కాబట్టి అభిమానులో కూడా భారీ అంచనాలే ఉంటాయి. అభిమనులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ ఓ చిక్కు ఉంది.

అదేంటంటే.. ఇప్పటి వరకు చూసుకుంటే టాలీవుడ్ లో హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి మొదటి స్థానం లో ఉంది. ఈ బాహుబలి రికార్డులను చిరు తన 150వ సినిమాతో బ్రేక్ చేస్తాడు అంటున్నారు మెగా అభిమానులు. దీంతో ఈ సినిమా పై ఖచ్చితంగా అభిమానుల ఆశల ఒత్తిడి, బాహుబలి రికార్డుల భారం రెండూ పడే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -