Monday, May 6, 2024
- Advertisement -

చిరు సినిమా టైటిల్!

- Advertisement -

ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినీ రంగ ప్రవేశం చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 150వ చిత్రానికిగాను చిరు ఎటుంవంటి కథ, టైటిల్‌తో సిల్వర్ స్క్రిన్‌ని షేక్ ఆడిస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

గత కొంత కాలంగా తమళ ఇలయతళపతి విజయ్ నటించిన కత్తి చిత్రాన్ని చిరు 150వ చిత్రంగా రీమేక్ చేస్తున్నారన్న వార్త వినిపించడం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి రామ్ చరణ్ నిర్మాణంలో.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు టైటిల్ కూడా కన్ఫామ్ అయినట్టేనని వినిపిస్తోంది.

తమిళ ఒరిజినల్ వెర్షన్ టైటిల్ ‘కత్తి’ కావడంతో తెలుగు రీమేక్ కు ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే ‘కత్తిలాంటోడు’ను వీలైనంత త్వరగా మొదలు పెట్టి 2017 సంక్రాంతి బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అయితే చిరు సరసన రొమాన్స్ చేయబోయే హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. మరి చిరు రీ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగాభిమానులకు ‘కత్తిలాంటోడు’ ఎలా అలరిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -