Thursday, May 9, 2024
- Advertisement -

అలా ఐతేనే చిరంజీవి చేస్తాడట!

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి అసలు 150వ చిత్రం చేస్తాడంటారా.. ? ఒక వేల చేస్తే ఇపుడున్న టైమ్లో ఎలాంటి వెంచర్ ను ఎంచుకుంటాడు.వినాయక్ తోనే తన ఫిలింను ఫిక్స్ అయ్యాడా లేక మిగతావారి కోసం చూస్తున్నాడా..? టాలీవుడ్లో ఇపుడు ఎక్కడ చూసినా వీటి గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి  తర్వాతి  సినిమాపై పరిశ్రమలో  రకరకాల రూమర్లు రౌండ్లు కొడుతున్నాయి.వాటిలో ఏది నిజమో తెలుసుకోలేక అతని అభిమానులు ఎంతగానో సఫర్ అవుతున్నారు.

చిరు కూడా ఈ విషయం ఏంటనేది తేల్చకుండా ఆలోచనలో పడిపోయాడు.కత్తి కథపై చిరంజీవి పునరాలోచనలో పడినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అది ఎందుకనేది ఆధ్యా న్యూస్ ఆల్రెడీ ఓ ఎక్స్ క్లూజివ్ స్టోరీని మీకందించింది. బ్రూస్ లీ  సినిమా తరువాత చిరు తన ఎంట్రీ గురించి తాను చేయాల్సిన పాత్ర గురించి రకరకాల లెక్కలు వేసేస్తున్నాడట.

తాను చేయబోయే 150 వ చిత్రాన్ని ఇటు  తెలుగులోనే కాకుండా అటు ఎంటైర్ సౌత్ వైడ్ రిలీజ్ చేయాలని చిరు బావిస్తున్నాడట. మరి ఆ స్థాయి  సినిమా తీసేవారు ఎవరనేదే ప్రధాన ప్రశ్న. 

ఇప్పటికే పూరి, వినాయక్, బోయపాటి లాంటి వాళ్లు చిరు చిత్రాన్ని రూపొందిస్తామని చెప్పినా… వారిలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని ఇంతకాలం సతమతమయ్యాడు. 

చివరకు ఠాగూర్  లాంటి మెసేజ్ సినిమా తీసిన వివివినాయక్ కే ఆఫర్ ఇచ్చినప్పటికీ….అఖిల్ చిత్రం రిజల్ట్ వచ్చాక ….తన  సినిమా ఇచ్చేది లేనిది చెబుతాడట. ఎందుకంటే ఒక వేల అఖిల్ తేడా కొడితే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తన చిత్రంపై పడొచ్చు.

సో ఈ యాంగిల్లోనే ఆలోచించినప్పుడు చిరు ఫ్యాన్స్ అంతా అఖిల్ హిట్ కొట్టాలని కోరుకోవచ్చు.చిరు ఫ్యాన్స్ కు కూడా వినాయక్ భాగా కనెక్ట్ అయిపోయారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -