Monday, May 13, 2024
- Advertisement -

” కంచె కి డిస్కౌంట్ ఇవ్వండి ” – ప్రేక్షకులు

- Advertisement -

రాదా కృష్ణ జాగర్లమూడి ఆకా క్రిష్ తెరకి ఎక్కించి సూపర్ ప్రసంసలు అందుకుంటున్న సినిమా కంచె, ఈ సినిమాలో వరుణ్ తేజ నటన తో పాటు సినిమా నేపధ్యం కూడా జనాల్ని బాగా ఆకట్టుకుంది. ఒక పూర్తి ఆసక్తికర సినిమాగా కంచె థియేటర్ లలో స్ట్రాంగ్ గా వెళుతోంది.

సినిమాలో సనాతన కాలం లో కులాల రచ్చ ఎలా ఉండేది, వాటిని ఎలా రెచ్చకొట్టే వారు అనేది చూపించారు క్రిష్ . ఎక్కడో జెర్మనీ కీ ఇటలీ కీ సాగిన రెండవ ప్రపంచయుద్ధం ప్రస్తావన కీ మన ఊళ్లలో జాతి గోడవలకీ చక్కగా లంకె పెట్టిన క్రిష్ ఆదరకోట్టేసారు అని చెప్పాలి. 

కులం మతం ప్రాంతం ఏదీ ఎత్తకుండా ఎవరి ప్రాంతం లేదా కులం గురించీ పేరు తీసుకుని రాకుండా ఎవరికీ వెయ్యాల్సిన గట్టి దెబ్బ, చురక వారికి వేసారు క్రిష్.  అందుకే ఈ సినిమాని ఇకముందు జరగబోతున్న జాతీయ – అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్స్ కి పంపించనున్నారు. అందుకు క్రిష్ సైతం సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతానికి ఓవర్సీస్ సహా అన్నిచోట్లా చక్కని వసూళ్లు సాధిస్తోంది. ఇలాంటి సినిమా కమర్షియల్ గా విజయాన్ని సాధించింది ఇది కూడా చాలా గొప్ప విషయం. 

సందేశాత్మక చిత్రం కావడం తో కులాల మీద తీసిన సినిమా కాబట్టి ప్రభుత్వం ఈ సినిమా కి కాస్త మినహాయింపులు ఇవ్వాలి అనే డిమాండ్ కొత్తగా ఊపు అందుకుంది. క్రిష్ త్వరలో ప్రభుత్వ అధికారులని కలిసి మరీ కంచె కి మినహాయింపు కోరే అవకాశం ఉంది .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -