Saturday, May 11, 2024
- Advertisement -

అన్నయ్య కోసం పవన్ ఎంత చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఇప్పుడు అన్నయ చిరు కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా? పవన్ ప్రస్తుతం వరస సినిమాలు చేయడానికి రెడి అయ్యాడు. అయితే పవన్ ప్రస్తుతం ఎస్ జే సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు అని అందరు అనుకున్నారు.

కానీ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాని ఇప్పుడు అన్నయ్య చిరంజీవికి త్యాగం చేసాడట. తను చేయాల్సిన సినిమాని అన్నయ్య కోసం వదులుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్త  ఫిలిం నగర్ సరౌన్దింగ్ లో హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో దాసరి నారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమా నుండి పవన్ తప్పుకొని అన్నయ్య కు చాన్స్ ఇస్తున్నాడట. దాసరి నిర్మాత, త్రివిక్రమ్ దర్శకుడు హీరో మాత్రమే మారతాడు. అంటే పవన్ స్థానంలో చిరంజీవి ఆ చిత్రాన్ని చేయబోతున్నాట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజు వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -