Friday, March 29, 2024
- Advertisement -

అమలకు సమంతకు అసలు పడటం లేదట..?

- Advertisement -

అక్కినేని కోడళ్ళ మధ్య అసలు పడటం లేదని.. ఎవరి దారులు వారివేనని టాలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా తాజా జరిగిన పరిణామాలను చూపిస్తున్నారు. సమంత.. చైతుని పెళ్లి చేసుకోవడంతో సామ్ అక్కినేని కోడలు అయిపోయింది. అయితే ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో స్వయంగా చేసిన వంటకానికి సంబంధించిన ఫోటోలు పంచుకుంది.

అయితే దీనికి కొద్దిరోజులు ముందు ఓ ఇంటర్వ్యూ లో అమల సమంతకు వంట రాదని, మా ఇంట్లో నాగార్జున వంట భేషుగ్గా చేస్తారు, ఇంక ఎవరో వండాల్సిన అవసరం లేదని చెప్పింది. అప్పటి అమల కామెంట్స్ కి కౌంటర్ గా సమంత ఈ వంట ప్రోగ్రాం పెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈనెల 8న అఖిల్ పుట్టిన రోజున సమంత మరియు నాగ చైతన్య కనీసం విషెష్ కూడా చెప్పలేదు. దీనితో వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఈ అత్తాకోడళ్ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కి కారణం ఏమిటన్నది తెలియడం లేదు. అత్తాకోడళ్ల మధ్య మనస్పర్థలు, చిన్న చిన్న తగాదాలు ఎప్పుడూ ఉండేవే.. ఐతే నాగ చైతన్య కూడా వీరికి దూరంగా ఉంటున్నాడా అనే సందేహం కలుగుతుంది.

ఇక చైతు, సామ్ ప్రేమ వివాహం నాగ్, అమలకు ఇష్టం లేదనే వార్తలు అప్పట్లో వచ్చాయి. మరి అప్పటి వీరి గొడవలు ఇంకా కొనసాగుతున్నాయా అనే సందేహం కలుగుతునే ఉంది. నాగ్ కూడా అమలను ప్రేమ పెళ్లే చేసుకున్నారు. కావున ఈ గొడవలకు మరేదో కారణం ఉండొచ్చని కొందరు అంటున్నారు. మరి కొందరు ఇవి కేవలం పుకార్లు మాత్రమే వారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎలాంటి గొడవలు లేవంటున్నారు. మరి దీనిపై సరైన క్లారిటీ వస్తే తప్ప ఈ వార్తలు ఆగేలా లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -