Friday, May 3, 2024
- Advertisement -

పాపం సునీల్.. ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా ?

- Advertisement -

స్టార్ కమెడియన్‌గా నటుడు సునీల్ కి ఎంతో పేరు ఉంది. అయితే కమెడియన్ నుంచి హీరోగా మారి సినిమాలు చేశాడు. హీరోగా సిక్స్ ప్యాక్ పెంచి కామెడీ నుంచి సీరియస్ హీరో అవ్వాలని అనుకున్నాడు. అలా ‘తడాఖా’ సినిమాతో సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. కానీ కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న సునీల్‌కి హీరో ఇమేజ్ సరిపోలేదు.

దాంతో మధ్యలోనే ఆయన హీరో ఇమేజ్‌కు బ్రేక్ పడింది. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి ‘డిస్కో రాజా’ సినిమాతో విలన్‌గా కొత్త గెటప్ ఎత్తారు. ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఇక నుంచి విలన్‌గా ట్రై చేయాలని అనుకుంటున్నట్లు ఓ సందర్భంలో అన్నారు. అయితే సునీల్ సినీ కెరీర్‌లో మార్పులు వచ్చినట్లే ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. హీరోగా ఉన్నప్పుడు రెండు నుంచి మూడు కోట్లు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమా చేసినా కూడా రోజుకి రెండు లక్షలు తీసుకుంటున్నాడట.

ఆ డబ్బు కూడా రోజంతా కాల్‌షీట్స్ ఇస్తేనే. లేకపోతే అందులోనూ కోతలు ఉంటాయని తెలుస్తోంది. మళ్లీ కమెడియన్ గా.. ఇతర పాత్రలతో ఇండస్ట్రీలో బిజీ కావాలని సునీల్ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫొటో’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -