Friday, March 29, 2024
- Advertisement -

త్రివిక్రమ్‌ని భయపెట్టేసిన పవన్ ఫ్యాన్స్…… పవన్ కూడా దూరం పెట్టాడా?

- Advertisement -

విద్యా పరంగా చూసుకుంటే పవన్‌ది ఇంటర్ ఫెయిల్ అయిన చరిత్ర. కాకపోతే తనకు ప్రపంచ జ్ఙానం బాగా ఉందని చెప్పుకుంటూ ఉంటాడు పవన్. కాకపోతే ఇప్పటి వరకూ పవన్ జ్ఙానం సంపూర్తిగా ప్రజలకు తెలిసేలా చేసిన సంఘటన అయితే ఒక్కటీ లేదు. కాకపోతే తనకు నచ్చిన జర్నలిస్టులను పిలుచుకుని ….. తాను చదివిన గొప్ప విషయాలను బట్టీ పట్టి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. పార్టీ పెట్టిన మొదటి స్పీచ్ నుంచి ఇఫ్పటి వరకూ కూడా అన్నీ రాసుకొచ్చి చదివిన ప్రసంగాలే. అయితే తనను తాను మేధావిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి త్రివిక్రమ్ లాంటి వాళ్ళ సాయం తీసుకున్నాడు పవన్. మేధావి అని తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు పిలుచుకునే త్రివిక్రమ్ చేతనే బోలెడన్నిసార్లు పొగిడించుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉండవల్లి, జెపి లాంటి వాళ్ళ చేత పొగిడించుకునే పనిలో ఉన్నాడు.

ఆ మధ్య ఓ సారి చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అని నాకు తెలుసు అని సెలవిచ్చిన పవన్…… ఇప్పుడు తానే అలాంటి పని చేశాడు అన్న అనుమానాలు వస్తున్నాయి. సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి అనీషా ఆంబ్రోస్‌కి మాటిచ్చాడు పవన్. ఆ తర్వాత అనీషాకు పవన్ తన ఫాం హౌస్‌లో ప్రత్యేక క్లాసులు కూడా తీసుకున్నాడన్న వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అనీషాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇక పూనం కౌర్ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో అజ్ఙాతవాసి సినిమాతో తనను డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్‌ని పవన్ దూరం పెట్టాడా అన్న సందేహాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆల్రెడీ తనకు అత్యంత సన్నిహితుడు అయిన శరత్ మరార్ కూడా పవన్ డబ్బు వ్యవహరాలు తట్టుకోలేక పవన్‌కి గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా పవన్‌కి దూరమయ్యాడా అన్న సందేహాలు వస్తున్నాయి. నితిన్ చల్ మోహన రంగా సినిమాను పవన్, త్రివిక్రమ్‌లు కలిసి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి పవన్-త్రివిక్రమ్‌లు కలిసి వస్తారని నితిన్ కూడా చెప్పాడు. పోస్టర్స్ కూడా వేశారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఫంక్షన్‌కి రాలేదు. సభా ప్రాంగణంలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్‌కి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూస్తే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి భయపడే త్రివిక్రమ్ ఫంక్షన్‌కి రాలేదా? లేక పవన్-త్రివిక్రమ్‌ల మధ్య విభేదాలు వచ్చాయా అన్న వార్త మాత్రం ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -