Monday, May 6, 2024
- Advertisement -

దేవర..క్లైమాక్స్ అదిరిపోతుందట!

- Advertisement -


కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్‌ని తొలుత ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుందని ప్రకటించగా తాజాఆ లేట్ అవుతోందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ని ఎన్టీఆర్ రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల. ముఖ్యంగా క్లైమాక్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట.

తొలుత రెండు రకాల క్లైమాక్స్ లు అనుకోగా ఈ రెండు ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరికి తెగ నచ్చేశాయట. అన్ని అనుకున్నట్లు జరిగితే రెండు క్లైమాక్స్‌లు ఉంటాయని తెలుస్తుండగా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. దేవర సినిమా సముద్రం నేపథ్యంలో జరగనుండగా రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల తెరకెక్కిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -