Sunday, June 16, 2024
- Advertisement -

కెసిఆర్ గ్రేటర్ వ్యూహం ఇదే .. అదుర్స్ !

- Advertisement -

2009లో పోటీ చేసేందుకే సాహ‌సించ‌ని అధినేత‌.. బ‌రిలో నిలిచేందుకు వెనుకంజ వేసిన నాయ‌కుడు.. ఆరేళ్ల‌లో అన్నిస్థానాల్లో నెగ్గేంత సత్తా ఎలా వ‌చ్చింది. ఉద్య‌మంలో బ‌క్క ప్రాణం.. ఉక్కుమ‌నిషిగా నిలిచి రాష్ట్రాన్ని ఎలా తేగ‌లిగారు. ఇవ‌న్నీ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అనే వ్య‌క్తికి ఎలా సాధ్య‌మ‌య్యాయి. అంటే.. “సంక‌ల్పం.. అదే నాబ‌లం” “ఉద్య‌మ‌మే నా ప్రాణం” అంటారు. అందుకే.. చుర‌క‌త్తుల్లాంటి మాట‌లు తెలంగాణ ప‌దాల‌తో ఇట్టే ఆక‌ట్టుకోగ‌లుగుతున్నారు. అదే ఆయ‌న బ‌లం!

రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేంతగా ఎదిగిన అంత‌టినేత‌కు గ్రేట‌ర్‌పీఠంపై ఎందుకింత మ‌మ‌కారం. హైద‌రాబాద్ మేయ‌ర్‌ప‌ద‌విని గులాబీద‌ళ‌మే చేజిక్కించుకోవాల‌ను ఎందుకు భావిస్తున్నారంటే… రాష్ట్రం గుండెకాయ‌.. భాగ్య‌న‌గ‌రం. అందుకే ఇక్క‌డ అధికారాన్ని సొంతం చేసుకోవ‌ట‌మే ల‌క్ష్యం. అందుకే.. బ‌ల్దియా ల‌డాయి సై అంటున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విసురుతున్నారు. అదీ తాను క‌నీసం చిన్న మాట మాట్లాడ‌కుండానే అన్నీ చ‌క్క‌బెడుతున్నారు. ఇంత‌కీ.. ఆ వ్యూహ‌క‌ర్త మ‌దిలో ఏముంది. గ్రేట‌ర్ గేమ్‌లో కేసీర్ వ్యూహం ప్ర‌త్య‌ర్ధిపార్టీల‌కు గుబులు పుట్టిస్తోంది. ఏ ప్ర‌తివ్యూహంతో అడ్డుక‌ట్ట వేయాల‌నేది అంతుచిక్క‌కుంది.

ఉన్న‌త‌చ‌దువు, దూసుకుపోయే చొర‌వ‌ ఉన్న త‌న త‌న‌యుడు కేటీఆర్‌కు గెలుపు బాధ్య‌త‌ను అప్ప‌గించారు. వెయ్యిమందికో ఇన్‌ఛార్జి చొప్పున నియ‌మించారు. ఇప్ప‌టికే ముస్లింల‌కు త‌న చేత‌ల ద్వారా హిందువుల‌కు చండీయాగంతో చేరువ‌య్యారు. ఇక బ‌స్తీ.. జ‌నం కేసీఆర్ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు క‌ట్టించి ఇస్తుండ‌టంతో మ‌రింత‌గా చేరువ‌వుతున్నారు. తెలంగాణ భావ‌జాలం ఉన్న యువ‌త‌కు కేసీఆర్ ఒక్క‌టే నేత‌. విమ‌ర్శ‌లు గుప్పించినా.. తామంతా ఆయ‌న వెనుకే ఉన్నామంటూ చెప్ప‌టం కేసీఆర్‌పై ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నం.

ఇటీవ‌ల వెలువ‌డిన నోటిఫికేష‌న్లు.. పోలీసులకు అల‌వెన్స్‌లు.. హోంగార్డుల‌కు జీతాలపెంపు.. ఔట్‌సొర్సింగ్ ఉద్యోగుల‌కు తాయిలం.. కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ప‌ర్మినెంట్ ఇవ‌న్నీ సానుకూల అంశాలే. శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉండ‌టంతో.. విదేశీ కంపెనీలు.. ఇక్క‌డ‌కు చేరుతున్నాయి. ఇన్ని ప్ర‌తికూల అంశాల‌తో.. అక్క‌డ‌క్క‌డా.. కొంత వ్య‌తిరేక‌త ఉన్నా.. ఎన్నిక‌ల ముందు అవ‌న్నీ గాలికి కొట్టుకుపోతాయ‌నేది కారు వేగాన్ని మ‌రింత దూకుడుగా న‌డిపేందుకు ఊత‌మిస్తాయి. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేసీఆర్ రాజ‌కీయం చాణక్య చ‌తుర‌త‌ మ‌రోసారి చూడ‌బోతున్నామనే అనుకోవాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -