- Advertisement -

లైంగిక వేధింపులు..ధురందర్ నటుడు అరెస్ట్

- Advertisement -

లైంగిక వేధింపుల కేసులో #Dhurandhar నటుడు నదీమ్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత పదేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతని ఇంట్లో పని చేసే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధిత మహిళ తన ఫిర్యాదులో కీలక విషయాలను వెల్లడించింది. నదీమ్ ఖాన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని చాలా కాలంగా శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేస్తానన్న హామీపై నమ్మకంతోనే ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పలేదని, కానీ వేధింపులు హద్దులు దాటడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది.

మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు భావించిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలాన్ని మరింత వివరంగా నమోదు చేస్తున్నామని, అవసరమైతే ఇతర ఆధారాలు, సాక్ష్యాలను కూడా సేకరిస్తామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన సినిమా పరిశ్రమలో కలకలం రేపుతోంది. మహిళల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసిన ఈ కేసులో న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిందితుడిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -