- Advertisement -

వైసీపీలో చేరితే ఇంత అరాచకమా?

- Advertisement -

నందిగామ నియోజకవర్గంలో కూటమి కక్షసాధింపు రాజకీయాలు తీవ్రస్థాయికి చేరాయని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిందన్న కారణంతోనే ఒక ముస్లిం మహిళ ఇంటిని కూల్చివేశారని స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

బాధితురాలు షేక్ సైదాబీ తెలిపిన వివరాల ప్రకారం, తాను ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరినందుకే తన ఇంటిని కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నానని, ఎలాంటి అక్రమ నిర్మాణం లేదని ఆమె తెలిపారు. పార్టీ మారినందుకు కోపంతోనే ఇంటిని కూల్చివేయించారని కన్నీళ్లతో వాపోయారు.

షేక్ సైదాబీ మాట్లాడుతూ, టీడీపీ మండల అధ్యక్షుడు కాండ్రగుంట శ్రీనివాస్ తనను పార్టీ మారినందుకు బెదిరించాడని ఆరోపించారు. ఆయన మాటలు, బెదిరింపులే ఈ చర్యకు దారి తీశాయని చెప్పారు. ఇంటి కూల్చివేత సమయంలో తాను, తన కుమార్తె తీవ్ర మనస్తాపానికి గురయ్యామని, ప్రస్తుతం తలదాచుకునే స్థలం కూడా లేకుండా పోయిందని వేదన వ్యక్తం చేశారు.

ఇంటి శిధిలాల మధ్య షేక్ సైదాబీ మరియు ఆమె కుమార్తె కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్నవారిని కలచివేసింది. వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించి, బాధితురాలికి న్యాయం చేయాలని, ఇలాంటి కక్షసాధింపు రాజకీయాలకు తెరదించాలని స్థానికులు, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -