Sunday, May 12, 2024
- Advertisement -

సర్దార్ టైంలో షకలక శంకర్ ని పవన్ కొట్టాడా..?

- Advertisement -
Did Pawan Kalyan Really Slap Shakalaka Shankar

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్.. కమెడియన్ షకలక శంకర్ పై చేయి చేసుకున్నాడనే అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఇలాంటి విషయం పవన్ ఎలాగో స్పందించాడు కాబట్టి.. మరి దెబ్బలు తిన్న షకలక శంకర్ పరిస్థితి ఏంటి..? ”అన్నమయ్యని వెంకటేశ్వరస్వామి కొట్టాడంటే నమ్ముతారా? రామదాసుని శ్రీరాముడు కొట్టాడంటే నమ్ముతారా? ఇదీ అంతే.

నమ్మకండి” అంటూ తనని కొట్టే అవకాశమే లేదని, పవన్‌ దేవుడైతే తాను భక్తుడినని షకలక శంకర్‌ చెప్పాడు. పవన్ కళ్యాణ్ ని దేవుడిలా భావిస్తానని శంకర్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ కి కోట్లల్లో అభిమానులు ఉంటారని.. ఎప్పుడైనా.. తమపై పవన్ కోప్పడే అధికారం, హక్కు ఉన్నాయని.. అంతే తప్ప చీమకి కూడా హాని చేయని మనస్తత్వమున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ శంకర్ అన్నాడు.

కొట్టలేదని గట్టిగా చెప్పినా, తనని మందలించిన మాట వాస్తవమే అనేది శంకర్‌ మాటల్లో ధ్వనించింది. అయితే పవన్ పై తనకి అభిమానం.. ప్రేమ తగ్గలేదని.. ఇప్పటికి తాను పవన్ కి భక్తుడినే అంటూ పవన్ కోశం రాసుకున్న ఓ పద్యాన్ని ఆలపించాడు. తన భుజంపై చెయ్యి వేసి.. ‘ఎందుకురా నేనంటే అంత ఇష్టం నీకు’ అని పవన్‌ అడిగాడని, అంతకంటే తనకేం కావాలని శంకర్‌ సంబరపడుతున్నాడు.

{youtube}NZB7yVZ-y0U{/youtube}

Related

  1. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  2. పవన్ “కాటమరాయుడు” కథ ఇదే…
  3. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -