Thursday, March 28, 2024
- Advertisement -

మహేష్ బాబు వల్ల కానిది షారూఖ్ వల్ల అవుతుందా ?

- Advertisement -

అవకాశం రావడం ఒక ఎత్తు ఆ అవకాశం మనల్ని వేరే దారిలోకి మార్చుకుని హిట్ దక్కించేలాగా చెయ్యడం ఒక ఎత్తు. ప్రస్తుతం కృతి సనన్ పరిస్థితి దీనికి సరైన ఉదాహరణ, తెలుగు లో టాప్ హీరో మహేష్ బాబు తో కృతి ఫస్ట్ సినిమాతో అరంగేట్రం చేసినా తరవాత ఆమెకి ఆఫర్ లు సరిగ్గా రాలేదు.

దోచెయ్ చిత్రం లో  మెరిసినా.. తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది క్రితి. మహేష్ బాబు సరసన హీరోయిన్ అనగానే సూపర్ అనుకున్న ఆమెకి సుకుమార్ సినిమా పెద్ద డిసాస్టర్ గా మారడం తో బాగా డీలా పడిపోయింది. ఇప్పుడు దిల్ వాలే సినిమా మీద చాలా నమ్మకాలూ పెట్టుకుంది.

పైగా ఈ మధ్యనే దిల్ వాలే షూటింగ్ లో ఉండగానే సుశాంత్ సింగ్ సినిమాకి సంతకం పెట్టేసింది ఈ అమ్మడు. ఇది రొమాంటిక్ కామేడా కావడంతో దీని మీద కూడా చాలా ఆశలు ఉన్నాయి ఆమెకి . ఏది ఏమైనా ఆమెకి సరైన హిట్ ఇవ్వలేకపోయిన మహేష్ బాబు లాగా షారూఖ్ కూడా హ్యాండ్ ఇస్తాడా లేక హిట్ ఇస్తాడా అని వచ్చే నెల కోసం ఎదురు చూస్తోంది ఆమె. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -