Wednesday, May 15, 2024
- Advertisement -

Exclusive: మహేష్ కు మతిపోగొట్టిన స్టార్ పిఆర్!

- Advertisement -

మహేష్ బాబు,అడ్డాల శ్రీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం…. బ్రహ్మోత్సవం.ఈ సినిమా షూట్ ఉన్నట్టుండి మద్యలో ఆగిపోవడంతో… సినిమాపై నెగిటివ్ టాక్స్ ఊపందుకున్నాయి.అయితే ఇలాంటి వార్తలు రాకుండా డ్యామేజ్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు.

దీంతో మహేష్ స్వయంగా రంగంలోకి దిగితే కాని డ్యామేజ్ కంట్రోల్ కాలేదు.వివరాల్లోకి వెళితే బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ జరుగుతూ ఉండగా…. ఆ సినిమాలోని తర్వాత కొంత పార్ట్ ను అడ్డాల శ్రీకాంత్ మహేష్ కు వినిపించాడు. ఐతే అది ఏమాత్రం ప్రిన్స్ కు నచ్చకపోగా ఇప్పటి వరకూ జరిగిన షూట్లోని పార్ట్ ను ఇలాగే కంటిన్యూ చేస్తే…. దెబ్బ తింటామనే అభిప్రాయాన్ని చెప్పాడు.

దాంతో సినిమా ఊటీ ట్రిప్ ను ఆపుకోవల్సి వచ్చింది.పైకి రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతుందని చెబుతున్నప్పటికీ…..ఆద్యా న్యూస్ వాకబు చేయగా అదేం లేదని తెలిసింది.విచిత్రమేమిటంటే ఏకంగా షూట్ జరుగుతున్నట్లు పిఆర్ ఓ తో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేశారు.

మొత్తానికి ప్రిన్స్ పిఆర్ ఓ ను పిలిచి మరీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మార్కెట్లో ఇంతలా నెగిటివ్ టాక్ వచ్చే వరకు ఎందుకు స్పందించలేదని మహేష్ స్టార్ పి.ఆర్.ఓ. బిఏ రాజును మందలించినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -