Friday, April 26, 2024
- Advertisement -

డిజె సినిమా ఫ్లాప్……. నిజం ఒప్పేసుకున్న దిల్ రాజు…… అబద్ధాలతో దొరికిపోయిన అల్లు అర్జున్

- Advertisement -

ఈ సంవత్సరం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి డిజె సినిమా ప్రత్యేకంగా నిలిచింది. అంటే మేకర్స్ చెప్పుకున్నట్టుగా బాహుబలిని బీట్ చేసిందనో, ఖైదీ నంబర్ 150ని దాటేసిందనో కాదు……. వివాదాల పరంగా ప్రత్యేకంగా నిలిచింది. అది కూడా ఆ సినిమాలో ఉన్న కథ, కథనం, సీన్స్, క్యారెక్టర్స్ గొప్పగా ఉండో, వివాదాస్పదంగా ఉండే ఇష్యూ అవ్వలేదు. అంతటి కథ, కథనాలు ఆ సినిమాలో ఎక్కడ ఉన్నాయి. ఒక చెడ్డ విలన్, వాడు చేసే వెధవపనులు, వాడిని శిక్షించడానికి వచ్చే హీరో అన్న పరమ రొటీన్ కధ……ఇక అదుర్స్‌లో ఎన్టీఆర్ చేసిన చారి లాంటి క్యారెక్టర్‌లో బన్నీ కనిపించాడు. సినిమా మొత్తం కూడా తొంభైల నాటి పాత వాసన కొడుతుంది. ఇక బన్నీ అయితే అదుర్స్‌లో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్‌లో పది శాతం కూడా చేయలేక చతికల పడ్డాడు. హరీష్ శంకర్ గురించి దర్శకత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు. అందుకే మొదటి రోజే ప్రేక్షకులు తిప్పికొట్టారు. క్రిటిక్స్ ఉతికి ఆరేశారు. మరీ పూజా హెగ్డే బికినీ సన్నివేశాలతో, అల్లు అర్జున్ లాంటి హీరోతో కండోమ్ చుట్టూ అల్లిన బూతు కామెడీతో డిజెను తెరకెక్కించి సమాజానికి ఏం సేందేశం ఇస్తున్నారు అని నిలదీశారు.

అయితే మేకర్స్ మాత్రం ఎదురుదాడికి దిగారు. మా సినిమా బ్లాక్ బస్టర్. ఖైదీ నెంబర్ 150 కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. బాహుబలిని బీట్ చేస్తోంది అని డప్పాలు కొట్టారు. అల్లు అర్జున్ కూడా అబద్ధాలే చెప్పాడు. ఇక హరీష్ శంకర్ అయితే మరీ రెచ్చిపోయాడు. ప్రక్షకులు ఇప్పటి వరకూ చూడని కళాఖండం ఏదో తాను తీసినట్టుగా….అలాంటి సినిమాను విమర్శిస్తారా అంటూ విరుచుకుపడిపోయాడు. అధికారిక లెక్కలు అంటూ డప్పాలు కొట్టాడు. దిల్ రాజు కూడా అలాంటి మాటలే చెప్పాడు. అయితే అసలు నిజాలను మాత్రం ఇప్పుడు ఒప్పేసుకున్నాడు దిల్ రాజు. డిజె సినిమా రెండు మూడు ఏరియాల్లో నష్టాలు మిగిల్చిందని చెప్పాడు. ఇక రెండు మూడు ఏరియాల్లో నష్టాలు మిగిల్చిన సినిమా ఫ్లాప్ సినిమానే అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాలా? అయితే ఇంతకాలం తర్వాత తప్పక దిల్ రాజు నిజం ఒప్పుకున్నాడని …..నష్టాలు అంతకుమించే ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్రేక్షకులు మారుతున్న నేపథ్యంలో పాత కథ, కథనాలు, బూతు కామెడీ, హీరోయిన్ బికినీ సీన్స్‌తో నెట్టుకొద్దామనే సీ గ్రేడ్ స్థాయి ఆలోచనలు మానేసి కాస్త కథ, కథనాలు కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఈ తిప్పలు ఉండేవి కాదు కదా అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తర్వాత సినిమాలకు అయినా జాగ్రత్తపడతారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -