Friday, May 3, 2024
- Advertisement -

నానీ కెలుకుడు నిజమే….. నానీపై సాయిపల్లవి ఘాటు కామెంట్స్

- Advertisement -

ఎంసిఎ సినిమా షూటింగ్ కొంత భాగం అయిన తర్వాత నుంచీ ఇండస్ట్రీలో చాలానే రూమర్స్ వినిపించాయి. మరీ ముఖ్యంగా నానీకి సాయిపల్లవికి అస్సలు పడడం లేదన్న వార్తలైతే యూనిట్ మెంబర్స్ నుంచి వినిపించాయి. నానీ బిహేవియర్‌గా సాయిపల్లవి ఇబ్బందిపడిందని చెప్పారు. మిగతా హీరోయిన్స్‌తో పోల్చుకుంటే సాయి పల్లవి కాస్త డిఫరెంట్ అమ్మాయి అని చెప్పొచ్చు. అవకాశాల కోసం వ్యక్తిత్వాన్ని చంపుకునే నేచర్ అయితే తనది కాదు. అలాగే బికినీలు, స్కిన్ షోలతో అట్రాక్ట్ చేసే టైప్ హీరోయిన్ అసలే కాదు. తన యాక్టింగ్ స్కిల్స్‌తోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ మెప్పిస్తున్న హీరోయిన్. ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ విమెన్ అని చెప్పొచ్చు. అందుకే హీరో అనేసరికి వ్యక్తిత్వం చంపుకుని అభివాదాలు చేడయం, అణిగి ఉండడం లాంటివి సాయిపల్లవి చేయదు. ఫిదా సినిమా టైంలో వరుణ్ తేజ్‌తో సహా శేఖర్ కమ్ముల కూడా సాయి పల్లవికి ఆ గౌరవం ఇచ్చారు. అందుకే సాయి పల్లవి కూడా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆ సినిమాను నిలబెట్టింది.

అయితే ఎంసిఎ విషయంలో మాత్రం సాయిపల్లవికి ఇబ్బందులు తలెత్తాయని యూనిట్ మెంబర్స్ చెప్తున్నారు. మరీ ముఖ్యంగా గత కొన్ని సినిమాల నుంచీ తన సినిమా కథ, కథనాల విషయంలో నానీ కెలుకుడు మరీ ఎక్కువైంది. నానీ బిల్డప్ షాట్స్ కూడా టాప్ స్టార్ హీరోల స్థాయికి ఏ మాత్రం తగ్గడం లేదు. మజ్నులాంటి థ్రిల్లర్, నిన్ను కోరి లాంటి సాఫ్ట్ స్టోరీస్‌లో కూడా కథతో సంబంధం లేకుండా నానీ బిల్డప్ షాట్స్, నానీ కోసం ఫైట్స్ ఉన్న విషయం సినిమా చూసిన వాళ్ళకు ఇట్టే అర్థమైపోతోంది. అలాగే కథలు కూడా పరమ రొటీన్‌ కథలను ఎంచుకుంటూ తనకు మాత్రమే పేరు వచ్చేలా చేసుకుంటున్నాడు నానీ. ఇప్పుడు ఎంసిఎ సినిమా విషయంలో కూడా సాయి పల్లవికి యాక్టింగ్ స్కోప్ ఉన్న సీన్స్‌ని, తనకు కూడా పేరు వచ్చేలా ఉన్న సీన్స్‌ని నానీ మార్చేశాడని చెప్తున్నారు. ముందుగా సాయిపల్వికి వినిపించిన సీన్స్‌లో చాలా వరకూ మార్పులు చేర్పులకు గురయ్యాయట. అన్నింటికీ మించి నానీతో సాయిపల్లవి డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడంతో కావాలనే సాయిపల్లవి క్యారెక్టర్‌ని తగ్గించి భూమిక సీన్స్‌ని పెంచారని తెలుస్తోంది. ఇప్పుడు ఫైనల్ సినిమాలో కూడా నానీ-సాయి పల్లవి సీన్స్ మరీ అంత ప్లస్సయ్యేలా ఉండవని, అలాగే ఫిదా సినిమా చూసి సాయి పల్లవికి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఎంసిఎ సినిమా చూశాక కాస్త డిసప్పాయింట్ అవుతారని చెప్తున్నారు.ఇంతకుముందు కూడా సూపర్ టాలెంటెడ్ హీరోయిన్స్‌ని మన టాలీవుడ్ చాలా తక్కువ చేసేసింది. వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉన్న హీరోయిన్స్ అంటే మన హీరోలకు చులకన భావం ఎక్కువ. అయితే నానీ లాంటి హీరో కూడా అదే విధంగా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.

నానీ బిహేవియర్‌తో ఇబ్బందిపడిన సాయిపల్లవి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో నానీపై గట్టి సెటైర్సే వేసింది. నానీలో ఒక సూపర్ డైరెక్టర్ ఉన్నాడని, సీన్స్ అన్నీ కూడా తన క్రియేటివిటీకి తగ్గట్టుగా సెట్‌లోనే మార్పులు చేర్పులు భలే చేస్తాడని చెప్పుకొచ్చింది. సాయిపల్లవి మాటల్లోనే నానీ ఏం చేశాడో అందరికీ అర్థమైంది. ఈ మొత్తం ఇష్యూలో దిల్ రాజు కూడా నానీకే సపోర్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎంతైనా ఇప్పుడు దిల్ రాజుతో వరుసగా సినిమాలు చేస్తున్న హీరో కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -