టాలీవుడ్ మరో సినిమా ఓటీటీలోకి విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలోకి రాగా అవి ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ సైతం విడుదలకు సిద్ధంగా ఉంది.
శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటించగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కి మైథలాజి కాన్సెప్ట్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇంటిముందు పెట్టే దిష్టిబొమ్మలతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి సినిమాపై అటెన్షన్ పెంచేశారు.
ఇక థియేటర్‌లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో మార్చి 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది అంటూ దిష్టిబొమ్మ ఫోటోని షేర్ చేస్తూ థియేటర్స్ లో మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయండి అంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ ,శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ అలాగే కార్తీక్ నిర్మాణం వహించారు.
