టాలీవుడ్ లో ఫస్ట్ మూవీతోనే.. ప్రేక్షకులను ఫిదా చేసింది అందాల భామ సాయి పల్లవి. ఈ సినిమా తో ఈమె బాగా ఫాపులర్ అయింది. ప్రస్తుతం డేట్స్ ఇవ్వమని తెగ బ్రతిమాలుతున్నారట నిర్మాతలు. కానీ ఈ మధ్య చాలా కథలను రిజెక్ట్ చేసిందట పల్లవి. ఇక నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ బానే ఇస్తామంటున్న.. ఒప్పుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కథ నచ్చడమే కాదు ఆ కథలో తన పాత్ర కూడా నచ్చితేనే ఆ సినిమా చేస్తుందట ఈ భామ.
ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలోనే కాకుండా శర్వనంద్ చేస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ఓకే అయింది. ఇక అసలు విషయం లోకి వెళ్తే.. రీసెంట్ గా అమ్మడు జనాల్లో బాగా ఫెమస్ కావడం వల్ల కొన్ని ప్రముఖ వాణిజ్య కంపెనీలు వారి కొత్త కంపెనీ బ్రాంచిల ప్రారంభోత్సవాలకు రమ్మని రిక్వెస్ట్ చేశారట. అలాగే కొంత డబ్బు కూడా ముట్టజెబుతామని ఆమె ముందు.. ప్రస్తావించడంతో ఈ అమ్మడు నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. అని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట.
కాకపోతే ఎవరైనా చారిటి ట్రస్ట్ లను గాని, అనాధ పిల్లల కోసం ఏవైనా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తే తనవంతు.. సాయంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్కడికి సంతోషంగా వస్తానని చెప్పేస్తూ.. మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుత రోజుల్లో తారలు ప్రతి సెకన్ ని డబ్బు కోసం వెచ్చిస్తుంటే ఈ అమ్మడు మాత్రం ఇలా మంచి కార్యక్రమాలకు తన సమయాన్ని కేటాయిస్తానని చెప్పడం చూస్తుంటే.. నిజంగా సాయి పల్లవికి ఎంతటివారైనా ఫిదా అవ్వల్సిందే.