Monday, May 13, 2024
- Advertisement -

హీరోయిన్ లు ఇద్దరూ కొట్టుకుంటున్నారు

- Advertisement -

పైకి హీరోలైనా హీరోయిన్స్ అయినా వేరే హీరోలతో కలిసినప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కానీ వేరువేరుగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. హీరోలైనా ఫ్రెండ్స్ గా ఉంటారేమో కానీ హీరోయిన్స్ మాత్రం కలిసి ఉండరు అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ మాటని నిజం చేస్తున్నారు కుర్ర హీరోయిన్లు ఆలియా భట్ మరియు శ్రద్దాకాపూర్ లు. ఈ ఇద్దరు భామల నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే శతృత్వం ఉందట. కారణాలు పెద్దగా బయటికి తెలియకపోయినా వీరి గొడవకి కారణం హీరో సిద్దార్థ్ మల్హోత్రా అని చెబుతుంటారు. ఆలియా భట్ తో మొదటి నుండీ ప్రేమలో ఉన్న ఈ హీరోని ఏక్ విలన్ సినిమా టైంలో తన వైపు తిప్పుకోవడానికి బాగానే కష్టపడి౦దట శ్రద్దాకాపూర్.

ఆ విషయం తెలిసినప్పటి నుండి శ్రద్దాకాపూర్ తో ఓపెన్ గానే చాలాసార్లు గొడవకి దిగిందట ఆలియా. ఇప్పుడు ఇద్దరు భామలు వరుస హిట్స్ కొడుతుండటంతో స్టార్ డంలో నేను తోపంటే నేను తోపు అని కూడా గొడవలకు దిగుతున్నారట. ఈ విషయంలో మీడియాలో లీక్ అయినా ఈ భామలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -