Friday, May 3, 2024
- Advertisement -

జెనీలియా మ‌ళ్లీ వ‌స్తోందంటా?

- Advertisement -

పెళ్ల‌యిన త‌ర్వాత కొత్త‌గా జెనీలియా పెద్ద‌గా సినిమాలు ఏమీ చేయ‌లేదు. రెండు హిందీ సినిమాలు, ఓ మ‌రాఠీ సినిమాలో గెస్ట్ రోల్‌లో న‌టించింది. ఆ త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌లేదు. ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌లో మంచిగా రాణించిన జెనీలియా త‌ర్వాత త‌న ప్రియుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకొని కుటుంబ జీవితానికే ప‌రిమిత‌మైంది. ఇప్పుడు వారికిద్ద‌రు పిల్ల‌లు. పిల్ల‌లు కొంచెం పెద్ద వాళ్లు అవ‌డంతో త‌ను మ‌ళ్లీ సినిమాల్లో న‌టించాల‌ని అనుకుంటోంది. ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో తాను మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించింది. దక్షిణాది భాషలతో పాటు.. మరాఠిలో నటించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది.

రానాతో కలిసి చేసిన ‘నా ఇష్టం’ అనే సినిమా తర్వాత తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైంది. త్వరలోనే మంచి క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల ముందుకొస్తానంటోంది. అయితే హీరోయిన్‌గా రావాల‌నుకుంటోందో.. లేదా క్యారెక్ట‌స్ ఆర్టిస్టుగా శ్రీదేవిలా ఆమె ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలు సెలక్ట్ చేసుకుంటుందా లేక సిమ్రాన్, భూమికలా క్యారెక్టర్ రోల్స్ చేస్తుందా అనేది త్వరలోనే తెలుస్తుంది.

సాంబ‌, సై, బొమ్మరిల్లు, ఆరెంజ్‌, హ్య‌పీ, క‌థ‌, రెడీ, శ‌శిరేఖ ప‌రిణ‌యం, నా ఇష్టం త‌దిత‌ర తెలుగు సినిమాల్లో మెరిసింది. ఇక త‌మిళ్‌తో పాటు హిందీలో కూడా మంచి న‌టిగా గుర్తింపు పొందిన స‌మ‌యంలో పెళ్లి చేసుకుని సినీ ప‌రిశ్ర‌మ‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -