Tuesday, April 30, 2024
- Advertisement -

గెట్ రెడీ ఫర్..పుష్ప 2 టీజర్!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రంతో బన్నీ ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ అయినా వైరల్‌గా మారుతుండగా తాజాగా పుష్ప 2 ది రూల్ టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 2024 ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సినిమాల ఫస్ట్ పార్టులో ఐటం సాంగ్‌లో సమంత అదరగొట్టగా సెకండ్ పార్టులో ఊర్వశి రౌటేలాను సంప్రదించినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -