Friday, May 3, 2024
- Advertisement -

పింఛన్ల పంపణీ షురూ..బాబుపై శాపనార్థాలు

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు కుయుక్తులతో ఆలస్యమైన పింఛన్ల పంపిణీ ఇవాళ్టి నుండి ప్రారంభమైంది. నేటి నుండి 6వ తేదీ వరకు కేటగిరిల వారిగా పింఛన్లు అందించనున్నారు. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఈసీ ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సచివాలయాల వద్ద చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు వృద్ధులు ,వికలాంగులు, వితంతువులు. చంద్రబాబు వల్లే పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము మళ్ళీ జగన్ కె ఓటు వేసి మా వాలంటీర్స్ ని తెచ్చుకుంటామని తేల్చి చెబుతున్నారు. పెన్షన్ కోసం అవ్వలు పెడుతున్న కన్నీళ్లు అందరిని కలిచివేశాయి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది మాత్రమే ఉండడంతో రెండు కేటగిరీలుగా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాల్లో పింఛన్లను అందజేయనున్నారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లతో కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్లను అందజేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ వాలంటీర్లను ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -