Saturday, May 3, 2025
- Advertisement -

ఓటీటీలోనూ పుష్ప 2 హవా!

- Advertisement -

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల పుష్ప-2 ది రూల్‌.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఈ సన్సేషన్‌ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ సుకుమార్‌ రైటింగ్‌ సంస్థతో కలిసి ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. తొలి రోజు నుంచే కంటిన్యూగా వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది. తాజాగా ఓటీటీలోనూ సత్తాచాటింది పుష్ప 2.

ఈ యాక్షన్-ప్యాక్డ్ టాలీవుడ్ చిత్రం జనవరి 30న Netflixలో విడుదలైంది. హిందీ, తమిళం, కన్నడ, బెంగాలి, మలయాళం వంటి భాషల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలోని హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 2 నిమిషాలు 3 సెకన్ల యాక్షన్ సీన్ 24 మిలియన్ వ్యూస్ సాధించడంతో పాటు 97,000 లైక్స్, వేల సంఖ్యలో కామెంట్లు చేశారు నెటిజన్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -