- Advertisement -

మంగ్లీ ఎఫెక్ట్..కేంద్రమంత్రిపై తెలుగు తమ్ముళ్ల ఫైర్!

- Advertisement -

సింగర్ మంగ్లీ ఎఫెక్ట్ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా రథ సప్తమి రోజు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవెల్లి సూర్యనారాయణుడిని దర్శించుకున్నారు. అయితే తనతో పాటు సింగర్ మంగ్లీని కూడా తీసుకెళ్లడంమే వివాదానికి కేరాఫ్ అడ్రసగ్‌గా మారింది.

వాస్తవానికి సింగర్ మంగ్లీ వైసీపీ హాయాంలో టీటీడీలో సలహాదారుగా పనిచేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు టీడీపీ వాళ్లు చంద్రబాబు ప్రచారం కోసం పాటలు పాడమని కోరితే పాడనని తేల్చి చెప్పేసిందట. ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమైంది.

నాడు చంద్రబాబు కోసం పాటలు పాడమంటే తిరస్కరించిన మంగ్లీని.. కేంద్ర మంత్రి అరసవెల్లిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం ఎంత వరకు కరెక్ట్ అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేగాదు చంద్రబాబును గతంలో విమర్శించిన మాటలను గుర్తు చేస్తూ రామ్మోహన్‌ నాయుడపై ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు.

కోట్లాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైనట్లులో పడిగాపులు కాస్తుంటే.. ఆమెకు వీవీఐపీ ప్రోటోకాల్ లో తీసుకెళ్లి స్వామి వారి దర్శనం అయ్యేలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -