Monday, May 20, 2024
- Advertisement -

గుంటూరు కారం ..వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే వసూళ్ల పరంగా మాత్రం సత్తాచాటింది గుంటూరు కారం.

తొలిరోజు రూ.50 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.44.50 కోట్లు, కర్నాటక రూ.4.5 కోట్లు, తమిళనాడు రూ. 0.5 కోట్లు ఇండియాలోని మరికొన్ని ప్రాంతాల నుండి మరో రూ. 0.5 కోట్లు వసూలు రాబట్టింది. రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మహేష్ అదరహో అనిపించారు.

ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన హనుమాన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వసూళ్ల పరంగా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అన్ని భాషల్లో కలిపి తొలి రోజు రూ.7.56 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.50 కోట్లు వసూలు చేయగా హిందీలో రూ.2 కోట్లు, మిగిలిన భాషల నుండి రూ.0.06 కోట్లు రాబట్టింది. మొత్తంగా మహేష్ గుంటూరు కారం వసూళ్లలో రారాజు అనిపించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -