Wednesday, May 8, 2024
- Advertisement -

8వ రోజు ఆగని హనుమాన్ సునామీ!

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ రికార్డులను తిరగరాస్తోంది. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లు సాధించే దిశగా దుసుకుపోతోంది. హనుమాన్ మూవీకి 8 రోజుల్లో రూ. 99 కోట్ల షేర్ కలెక్షన్లతో పాటు రూ. 166 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి రూ. 55.19 కోట్ల లాభాల్లో ఉంది హనుమాన్. పిల్లల వినోదం కోసం సూపర్ హీరో యాక్షన్ సీక్వెన్స్ లు, కామెడీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. అదే సమయంలో మన చరిత్ర కూడా సూపర్ హీరో ఎలిమెంట్ తో ముడిపడి ఉంది.

మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుండి బాలయ్య వరకు సినిమా బాగుందని కితాబిచ్చారు. హనుమాన్ సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తున్నాను అని బాలయ్య చెప్పడం విశేషం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -