Monday, April 29, 2024
- Advertisement -

త్వరలో ఐదో జాబితా..!

- Advertisement -

ఏపీ సీఎం జగన్‌ ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి పిలిపించారంటేనే వారిలో టెన్షన్ మొదలవుతోంది. ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో 58 మంది అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇది మొత్తం సిట్టింగ్‌ల మార్పే. ఇక నాలుగో జాబితానే సిట్టింగ్‌ల మార్పు ఫైనల్ అనుకుంటుండగా తాజాగా మరో బాంబ్ పేల్చారు వైసీపీ నేతలు. త్వరలో ఐదో జాబితా ఉండనుందని తేలడంతో ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది.

ఇప్పటివరకు 68 చోట్ల 58 అసెంబ్లీ ,10 స్థానాల్లో పార్లమెంట్ ఇంఛార్జ్ లను ప్రకటించారు. గెలుపే ప్రామాణికంగా పార్లమెంటు, అసెంబ్లీ అన్న తేడా లేకుండా మార్పు చేపడుతున్నారు జగన్. ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైంది అంటే…తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పిలుపు వచ్చిందంటే చాలు మార్పు లేదంటే నో టికెట్… ఈ రెండే ఆప్షన్లు వినిపిస్తున్నాయి.

మంత్రులకు కూడా స్థాన చలనం ఉండటం విశేషం. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఊహించని విధంగా చిత్తూరు ఎంపీ టికెట్ కట్టబెట్టారు. చిత్తూరు ఎంపీగా ఉన్న ఎన్ రెడ్డప్పకు గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు అప్పజెప్పారు. హోం మంత్రి వనితను కొవ్వూరు నుండి గోపాలపురానికి మార్చేశారు. ఇక త్వరలో ఐదో లిస్ట్ విడుదల కానుండగా ఈసారి ఎవరికి స్థాన చలనం ఉంటుందోనని అంతా టెన్షన్‌తో ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -