Sunday, April 28, 2024
- Advertisement -

హర్భజన్ కి పాపం హనీమూన్ లేదు !

- Advertisement -

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ పెళ్లి కళలో బిజీ గా గడుపుతున్నాడు. అతని ఇంట్లో పెళ్లి సందడి మొదలు యయి మెహందీ , సంగీత కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు మనోడు. గురువారం తన స్నేహితురాలు గీతా బుశ్రాని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలు పెడతాడు. అయితే పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లడం లేదని చెప్పాడు. 

‘నేను దేవుడిని నమ్ముతాను. ఆయన ఆశీస్సులతో నేటి నుంచి నా జీవితంలో కొత్త ఆధ్యాయం ప్రారంభమవుతుంది అంటున్నాడు బజ్జీ. హనీమూన్ ప్రణాలికలు ఏమీ లేవు పెళ్లి తంతు ముగిసిన తరవాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి రంగం లోకి దిగాల్సి ఉంది అంటున్నాడు బజ్జీ. దక్షిణాఫ్రికా సీరీస్ లో అశ్విన్ కి గాయం అవ్వడం తో భజ్జీ అక్కడకి అశ్విన్ స్థానం లో ఆడిన సంగతి తెలిసిందే. ” 

మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో నాకు చోటు లేకపోవడం విషయం విరాట్ తో ఇప్పటికే మాట్లాడాను, ప్రొటీస్ జట్టులో ముగ్గురు కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండటంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కావాలనుకుంటున్నట్లు చెప్పాడు. నిజంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇలా చెప్పడం నాకు నచ్చింది. ” అన్నాడు బజ్జీ 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -