Saturday, May 4, 2024
- Advertisement -

చిరంజీవి ఋణం తీర్చుకోలేను – బాలీవుడ్ దిగ్గజం

- Advertisement -

థియేటర్ ఆర్ట్స్ లో నుంచి సినిమాల్లోకి వచ్చి మహారాణులు, మహారాజులు లాగ సినీ వినీలాకాశం లో ఎగురుతున్న వారు ఎందఱో ఉన్నారు. 

ప్రకాష్రాజ్ – షబానా ఆజ్మి – నందితాదాస్ – జంధ్యాల – రాధిక ఆప్టే .. ఒకరేమిటి.. ఎందరో థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి నటీనటులుగా స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ ఆర్ట్స్ కి అంత పేరు లేదు కానీ ముంభై లాంటి నగరాల్లో థియేటర్ ఆర్ట్స్ అంటే పడి చచ్చేవారు ఎందఱో ఉన్నారు. స్టేజీ డ్రామాలు అంటే బాగా ఇష్టపడేవారు కోకొల్లలు కనిపిస్తారు. మెగా స్టార్ చిరంజీవి లాంటి లెజెండ్ లు సైతం తమ మొదటి రోజుల్లు స్టేజీ డ్రామాలు పిచ్చగా ప్రేమించి అక్కడ నేర్చుకుని ఇక్కడ తెరమీద నటించేవారు. ఆ దారిలోంచే సినిమాల్లోకి వచ్చారు కూడా. 

అందుకే బాలీవుడ్ దిగ్గజం మహేష్ భట్ హైదరాబాద్ చేరుకున్నప్పుడు థియేటర్ – డ్రామా గురించి మాట్లాడుతూ ఉన్న సమయం లో థియేటర్ – పెర్ఫామింగ్ ఆర్ట్స్ ప్రభావితం చెందేవి.. అని అన్నారు. అంతేకాదు ఓ అరుదైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్థావించారు. ఆరోజుల్లో నేను జెంటిల్మన్ (చిరంజీవి) – జకమ్(నాగార్జున) వంటి సినిమాలు నిర్మించాను.  

చిరంజీవి జెంటిల్మేన్ సినిమా సమయం లో నాదగ్గర డబ్బులు లేకపోయినా ఆయన అంగీకరించి నటించారు. ఆయన ప్రేమ ఎప్పటికీ మరచిపోలేను, ఆయన ఋణం తీర్చుకోలేనిది అన్నారు మహేష్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -