Monday, April 29, 2024
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు…కేసీఆర్‌కు క్లీన్‌చీటేనా?

- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై ఎన్నికల వేళ తీవ్ర అపోహలు నెలకొన్నాయి. నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడంతో ఆరోపణలు రాగా దీనిపై కేంద్ర బృందం పర్యటన చేసింది. హుటాహుటినా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజినీర్‌ అనిల్‌జైన్‌ ఛైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో సీడబ్ల్యూసీ కమిటీని నియమించింది.

మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కమిటీ తర్వాత హైదరాబాద్‌లో ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైంది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన వివరాలతో ప్రజంటేషన్‌ ఇచ్చారు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దెబ్బతిన్న పియర్స్‌ ఉన్న బ్లాక్‌కు కాఫర్‌డ్యాం నిర్మించి మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొనగా ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడుతుందని విపక్షాలతో సహా బీజేపీ భావించింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కేసీఆర్ ప్రభుత్వానికి క్లీన్ చీటే లభించే అవకాశం ఎ్క్కువగా కనిపిస్తోంది.

పియర్స్‌ కుంగిన ఏడో బ్లాకే కాకుండా బ్యారేజీ అంతా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొలతలు తీసి ఇంకెక్కడైనా ఇలాంటి సమస్య వస్తుందేమో చూడాలని, పియర్స్‌కు నెర్రెలు వచ్చిన చోట మ్యాపింగ్‌ చేయాలని సలహా ఇచ్చింది కేంద్ర బృందం. దెబ్బతిన్న పిల్లర్‌ ర్యాఫ్ట్‌ కింద 300 మి.మీ. వరకు, మిగిలిన రెండింటి కింద 150 మి.మీ. గ్యాప్‌ ఉండొచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. నీటిని నిలిపివేసి పరిశీలించాక కచ్చితమైన కారణమేమిటన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు పెద్దగా ఒరిగేదేమీలేదని తెలుస్తోంది. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు తలెత్తినా అది బీఆర్ఎస్ లైట్ తీసుకుంటున్నట్లుగానే సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -