Tuesday, May 14, 2024
- Advertisement -

మోహన్ లాల్ ,ఎన్టీఆర్ ని వాడేస్తున్నాడా?

- Advertisement -
Heavy demand for Mohanlal movies in tollywood

జనతా గ్యారేజ్ మూవీతో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్స్ లో స్థానం సంపాదించాడు. అయితే.. ఈ మూవీలో మోహన్ లాల్ కు ప్రాధాన్యత ఉన్న రోల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసలు మోహన్ లాల్ ను తీసుకోవడంలోనే.. ఎన్టీఆర్ కు మలయాళంలో ఇమేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం ఉంది.

కానీ సినిమా వచ్చింది సక్సెస్ అయింది కానీ.. ఎన్టీఆర్ కు మోహన్ లాల్ ఏ మాత్రం ఉపయోగపడ్డాడంటే క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. జనతా గ్యారేజ్ తర్వాత మోహన్ లాల్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఏర్పడింది. కొత్త పాత సినిమాల డబ్బింగ్ లకు క్యూ కట్టేస్తున్నారు తప్ప.. ఎన్టీఆర్ కు ఒరిగినటు ఏమి కనిపించడం లేదు.

అటు జనతా గ్యారేజ్ తో కూడా మోహన్ లాల్ బాగానే వెనకేసుకున్నాడు. భారీ పారితోషికంతో పాటు.. మలయాళ రైట్స్ కూడా తీసుకున్నాడు. కానీ ఎట్ లీస్ట్.. ఎన్టీఆర్ ను మల్లూవుడ్ కి పరిచయం చేసేందుకు కూడా ప్రయత్నించలేదు. ఎన్టీఆర్ ను వాడుకుని మోహన్ లాల్ కు మార్కెట్ పెరిగిందే తప్ప.. జనతా గ్యారేజ్ తో మల్లూవుడ్ లో ఎన్టీఆర్ కు ప్రయోజనమేమీ దక్కలేదని.. ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -