Sunday, April 28, 2024
- Advertisement -

హెబ్బా పటేల్ ను స్పెయిన్ కు పిలిపించుకున్న ఎన్టీఆర్, సుకుమార్!

- Advertisement -

కుమారి 21 ఎఫ్ గర్ల్ ను ఉన్నట్టుండి స్పెయిన్ ను పిలిపించుకున్నారట ఎన్టీఆర్, సుకుమార్ లు! ప్రస్తుతం అక్కడ ‘నాన్నకు ప్రేమతో’ షూటింగులో బిజీగా ఉన్న ఈ హీరో, దర్శకులు ఈ అమ్మాయికి వీసా అప్రూవల్ ఇప్పించుకుని స్పెయిన్ కు రప్పించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఆమెను అక్కడకు తీసుకెళ్లారు అంటే.. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆమెకు ఒక ప్రత్యేక పాత్రను ఆఫర్ చేస్తూ వాళ్లు ఆమె ను విమానం ఎక్కించారని ప్రచారం జరుగుతోంది. మరి ఒకవైపు విడుదల తేదీ కూడా ఫిక్సయ్యాకా… ఉన్నట్టుండి హెబ్బాకు ఒక పాత్ర ను ఆఫర్ చేయడం ఏమిటి? అనేది పెద్ద సందేహం!

ఇప్పటికే నాన్నకు ప్రేమతో షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈసినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ సినిమా బాలయ్య డిక్టేటర్ తో ఢీ కొట్టబోతోంది కూడా! ఇలంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ హెబ్బాకు ప్రత్యేక పాత్ర ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే హెబ్బా స్పెయిన్ వెళ్లడంతో.. ఆమెకు కచ్చితంగా ఏదో ఒక పాత్ర దక్కే ఉంటుందని అనుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఇది హెబ్బాకు లభించిన లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి! ఇంతకీ ఆమె పాత్ర కథాకమామిషు ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -