Friday, May 10, 2024
- Advertisement -

ప్రొడ్యూసర్ రాం గోపాల్ వర్మ – డైరెక్టర్ రాజ్ తరుణ్!

- Advertisement -

హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య కాలం లో భారీ గా పేరు ప్రఖ్యాతలు పొందేసాడు ఈ హీరో. కుమారీ 21 ఎఫ్ సినిమా తో కెరీర్ కే పెద్ద హిట్ కొట్టిన ఈ హీరో తరవాత ఏ సినిమాకీ ఇంకా సంతకం పెట్టలేదు . అప్పుడెప్పుడో ఓకే చెప్పిన రామయ్య సిత్రాలూ సినిమా త్వరలో విడుదలకి సిద్దంగా పెట్టుకున్నాడు రాజ్.ఈ గ్యాప్ లో రాం గోపాల్ వర్మతో ఒక సినిమా తీస్తాను అని అంటున్నాడు రాజ్. అది కూడా తాను డైరెక్టర్ గా వర్మ కథ ఇచ్చే విధంగా ఉంటుందట పరిస్థితి.

ఈ విషయం రాజ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. తనలో మంచి డైరెక్టర్ ఉన్నాడు అని తనతో పాటు వర్మ లాంటి పెద్ద డైరెక్టర్ నమ్మడంతో ఈ అడుగు వేస్తున్నాడు. నిజానికి డైరెక్టర్ అవ్వడంకోసమే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాను అని చెబుతున్న రాజ్ తరుణ్ యాభై కి పైగా షార్ట్ ఫిలిం లకి పనిచేసిన అనుభవం ఉంది . కానీ అనుకోకుండా హీరో అయిపోయాడు. వరుసగా మూడు విజయాలు అందుకొని హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. ఎప్పటికైనా నాదైన సినిమాని తెరపై చూసుకుంటా అంటున్నాడు. అందుకే సెట్ నుంచి ఇంటికి రాగానే కథలు రాసుకుంటూ గడుపుతుంటాడట. 

ఆ ఆసక్తి గురించి తెలుసుకొన్న రామ్ గోపాల్ వర్మ రాజ్ తరుణ్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను రాసిన ఒక ప్రేమ కథ రాజ్ తరుణ్ దర్సకత్వం లో వస్తే వర్మ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తాడట. రామూ లాంటి వారు ఇలాంటి ఆఫర్ ఇస్తే కాదని ఎవరు అంటారు ? వెంటనే ఓకే చెప్పేసాడు. ఇలోగా వర్మ తో ఒక మూకీ సినిమా ప్లాన్ కూడా నడుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -