Thursday, May 9, 2024
- Advertisement -

హీరోయిన్ లకి హ్యాండ్ ఇస్తున్నాడు

- Advertisement -

టైగర్ ఫేం డైరెక్టర్ వీఐ ఆనంద్ డైరెక్షన్ లో రాబోతున్న నిఖిల్ సినిమాకి ముగ్గురు హీరోయిన్ లని ఓకే అనుకున్న విషయం ఇదివరకే ప్రకటించాం కాగా వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. తాప్సి పన్ను – కేథరిన్ థ్రెసా – అవికా గోర్ లతో నిఖిల్ రొమాన్స్ చేస్తాడని ముందు ప్రకటించారు.

కానీ ఇప్పుడు వారిలో ఒక్కక్కరితో మొదలుపెట్టి ముగ్గురినీ తీసి పక్కనబెట్టేశారు. తాప్సీ స్థానం లో కుమారీ 21 ఎఫ్ పిల్ల హేబా పటేల్ ని తీసుకున్నారు. తరవాత కేథరిన్ ని తీసుకున్నట్టు గానే తీసుకుని ఆమెనీ పీకేశారు. అవికా గొర్ కూడా మూడవ స్థానంలో డౌట్ అంటున్నారు.

బబ్లీ గా తయారైన అవికా నిఖిల్ పక్కన బాగోదన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ఆమె విషయంలోనూ మనసు మార్చుకున్నారట. ఓ ప్రయోగాత్మక కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదికి వెళ్తుంది.

‘శంకరాభరణం’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉన్నాడు నిఖిల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -