కోనా వెంకట్ అంటే ఇండస్ట్రీ లో ఒక మంచి పేరు ఉంది, ఏ హీరో అయినా ఆయన స్క్రీన్ ప్లే ఇస్తే లేదా డైలాగ్ లు ఇస్తే సినిమా సూపర్ హిట్ అన్న చందంగా ఉంటారు. చాలా ఆసక్తికరంగా సినిమా ని తీర్చిదిద్దడం లో కోనా వెంకట్ ఎక్స్ పర్ట్.
శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్ తో కలిసినపుడు కోనా టాలెంట్ ఇంకా చక్కగా కనిపిస్తుంది. వాటికి ఉదాహరణ లే వెంకీ నుంచి బాద్ షా వరకూ వచ్చిన సూపెర్ హిట్ లు . అలాంటి రైటర్ స్వయంగా వచ్చి నిఖిల్ ని తనతో సినిమా తీయమని అడిగినప్పుడు నిఖిల్ ఉబ్బితబ్బిపోయాడు. అప్పుడే శంకరాభరణం సినిమా బయటపడింది. ఈ సినిమా కి కోనా ప్రొడ్యూసర్ మాత్రమే కాకుండా రైటర్ డైరెక్టర్ గా పని చేసి సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు. కోనా వెంకట్ కి ఇది మూడవ ప్రొడక్షన్ మొదట గీతాంజలి ని నిర్మించి తరవాత త్రిపుర కి కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు ఆయన. ఇప్పుడు శంకరాభరణం విడుదల కి సిద్దం అవుతున్న తరుణం లో నిఖిల్ టెన్షన్ గా ఉన్నాడు అని అంటున్నారు. వరసగా బ్రూస్ లీ , త్రిపుర , అఖిల్ సినిమాల ఫలితాలు చూసాక తన సినిమా కాస్త డిఫెరెంట్ అయినా కూడా నిఖిల్ ఎందుకో జంకుతున్నాడు అని సమాచారం. అందుకే పబ్లిసిటీ మీద పూర్తి దృష్టి పెడుతున్నాడట