కార్తికేయ-2 ఎలా ఉందంటే ..?

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ” కార్తికేయ-2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ చిత్రానికి సిక్వల్ గా రూపొందిన ” కార్తికేయ 2 ” పై గట్టిగానే అంచనాలు ఏర్పడ్డాయి. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతున్న ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు (ఆగష్టు 13 ) విడుదలైంది.

మిస్టరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీపై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. శ్రీకృష్ణుడి దివ్యక్షేత్రం అయిన ద్వారక కు వెళ్ళిన హీరో అనుకోకుండా ఓ మిస్టరీ కేస్ లో ఇరుక్కుంతాడు. ఆ తారువత హీరో ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు ? ఇంతకీ ఆ మిస్టరీ కేసు ఏమిటి ? అనేది మూవీ స్టోరీ పాయింట్. కథలో కొత్తదనం లేపఓయినప్పటికి కథనం కాస్త ఆకట్టుకునే విధంగా ఉండడంతో మూవీపై పాజిటివ్ టాక్ ఏర్పడింది.

ముఖ్యంగా మూవీకి వి‌ఎఫ్‌ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచాయి. ఈ మూవీకి ఏం ఏం కీరవాణి తనయుడు కాలభైరవ మ్యూజిక్ అందించాడు.ఇక మూవీలో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నప్పటికి ఓవరాల్ గా మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎంతో కాలంగా ఫ్లాప్ లతో సమమతమౌతున్న నిఖిల్ కు ఈ మూవీ కాస్త ఊపిరినిచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో ఈ మూవీ ఫుల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.

Related Articles

Most Populer

Recent Posts