Tuesday, May 14, 2024
- Advertisement -

మహేష్ కత్తికి వార్నింగ్ ఇచ్చిన నితిన్

- Advertisement -

కత్తి మహేష్.. ఈ మధ్య కాలంలో.. బాగా ఫాపులర్ అయిన పేరు. బిగ్ బాస్ షో రాకముందు.. ఈయన పెద్దగా ఎవరికి తెలియదు. అయుతే బిగ్ బాస్ షోకి వచ్చాక.. రెండో రౌండ్ లోపు ఎలిమినేట్ అవుతారని.. అందరూ భావించారు. కానీ కత్తి మహేష్ నాలుగు వారాలు అందులో ఉండి ప్రేక్షకుల స్పందన పొందాడు.

బిగ్ బాస్ షో నుంచి వెళ్లిపోయాక.. కత్తి మహేష్ తన వృత్తి అయిన క్రిటిక్స్ కి చాలా దగ్గరయ్యారు. అయితే వచ్చి రావడంతోనే.. ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ని తన వద్ద అసలు డబ్బులే లేవని చెబుతూ.. పబ్లిక్ పంక్షన్ లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విమర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. పవన్ సినిమాలపై.. అతడి యాక్టింగ్ పై, రాజకీయాల గురించి.. కత్తి మహేష్ చాలా ఘాటుగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్ పైన పవన్ ఫ్యాన్స్ అనేక కామెంట్స్.. చేశారు. పవన్ అభిమానించే నితిన్ కూడా మహేష్ పైన సీరియస్ అయ్యారు.

ఏకంగా కత్తి మహేష్ కి ఫోన్ చేసి పవన్ గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడే ప్రతి మాటకూ నీవు భవిషత్తు లో ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసా? అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. నితిన్ ఇచ్చిన వార్నింగ్ ఫై నితిన్ పైన పోలీసు కంప్లైంట్ చేసే ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఇక పవన్ అభిమానులు.. మహేష్ కత్తికి.. ఫోన్స్, మెస్సేజెస్ చేస్తూ.. వేధిస్తున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -